: ఐదోసారి జాతీయ అవార్డు అందుకోనున్న ఇళయరాజా
దక్షిణాది ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా అరుదైన రికార్డును నెలకొల్పారు. దర్శకుడు బాల రూపొందించిన చిత్రం ‘తారై తప్పట్టై’ కు ఆయన సంగీతం అందించారు. ఇది ఆయన 1000వ చిత్రం. వెయ్యి సినిమాలకు సంగీతం అందించిన రికార్డుతో పాటు, ఇదే చిత్రానికి ఉత్తమ సంగీత నేపథ్యం విభాగంలో ఆయన జాతీయ అవార్డును దక్కించుకున్నారు. ఇళయరాజాకు జాతీయ అవార్డు దక్కడం ఐదోసారి. కాగా, గతంలో తెలుగు చిత్రాలు సాగరసంగమం (1984), రుద్రవీణ (1989) చిత్రాలకు, తమిళ చిత్రం సింధుభైరవి (1986), మళయాళ సినిమా పళాసి (2009) చిత్రాలకు ఆయన జాతీయ అవార్డులు అందుకున్నారు.