: భారత్ తో మ్యాచ్ లో విండీస్ జట్టులో మార్పు...ఫ్లెచర్ స్థానంలో సిమ్మన్స్
గురువారం ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా టీ20 సెమీఫైనల్ మ్యాచ్ లో భారత్-వెస్టిండీస్ జట్లు తలపడనున్నాయి. భారత్ తో జరిగే మ్యాచ్ లో విజయం లక్ష్యంగా విండీస్ కసరత్తు ప్రారంభించింది. అందులో భాగంగా జట్టులో ఎలాంటి లోపాలు ఉండకూడదని భావిస్తోంది. దీంతో గాయంతో బాధపడుతున్న ఫ్లెచర్ స్థానంలో ఆల్ రౌండర్ సిమ్మన్స్ ను జట్టులోకి తీసుకునేందుకు సిద్ధమవుతోంది. భారత్ తో మ్యాచ్ లో ఆల్ రౌండర్లు ఎక్కువ మంది ఉంటే జట్టుకు ఉపయోగపడుతుందని విండీస్ భావిస్తోంది. దీంతో ఆల్ రౌండర్ కు ఓటేసింది. భారత ఆటగాళ్ల ఆటతీరుపై పూర్తి అవగాహన ఉన్న విండీస్ ఆటగాళ్లు స్థాయికి తగ్గట్టు రాణిస్తే విజయం సాధించడం పెద్ద కష్టం కాదని విండీస్ భావిస్తోంది. ఇదే సమయంలో ఏమాత్రం ఏమరుపాటుగా ఉన్నా కెప్టెన్సీతో ధోనీ విండీస్ ను ఇంటికి పంపడం ఖాయం అని వారు భావిస్తున్నారు. దీంతో జట్టును బలోపేతం చేస్తున్నారు.