: వారిని మీరు తొలగించగలరా?: దీదీకి అమిత్ షా సవాలు
స్టింగ్ ఆపరేషన్ లో దొరికిన తృణమూల్ నేతలను పార్టీ నుంచి తొలగించగలరా? అంటూ బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి సవాలు విసిరారు. కోల్ కతాలో మీడియాతో ఆయన మాట్లాడుతూ, అవినీతికి వ్యతిరేకంగా పోరాడుతానంటూ అధికారంలోకి వచ్చిన మమతా బెనర్జీ, అవినీతి పరులకు కొమ్ముకాస్తున్నారని అన్నారు. ఈ సందర్భంగా శారదా కుంభకోణంలో పాత్రధారులకు న్యాయం జరిగేలా తృణమూల్ తో బీజేపీ మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకుందన్న వ్యాఖ్యలను ఆయన ఖండించారు. మీడియా సంస్థ చేసిన స్టింగ్ ఆపరేషన్ లో పట్టుబడిన నేతలను మమతా బెనర్జీ ఎందుకు పార్టీ నుంచి తొలగించడం లేదని ఆయన నిలదీశారు. తన పార్టీ నేతలపై ఆమెకు నమ్మకం ఉంటే సీబీఐ ఎంక్వయరీకి ఆదేశించాలని ఆయన డిమాండ్ చేశారు.