: ఫేవరేట్ అయితే ఏంటి?: ఇంగ్లండ్ కెప్టెన్ ప్రశ్న
టీ20 వరల్డ్ కప్ లో ఇప్పటికి వరకు ప్రదర్శించిన ఆటతీరును బట్టి అంతా న్యూజిలాండ్ ను టైటిల్ ఫేవరేట్ అంటున్నారు. అయితే, టైటిల్ ఫేవరేట్ అయితే ఏంటని ఇంగ్లండ్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ ప్రశ్నించాడు. తొలి మ్యాచ్ లో వెస్టిండీస్ చేతిలో ఓడినప్పటికీ సౌతాఫ్రికా, శ్రీలంక జట్లపై సాధించిన విజయాలను గుర్తుచేశాడు. టైటిల్ వేటలో తామేమీ తక్కువ తినలేదని స్పష్టం చేశాడు. తమ ముందున్నది ఏ జట్టు అన్నది కాదని, తమకు మైదానంలో ప్రదర్శన ప్రధానమని తెలిపాడు. న్యూజిలాండ్ తో రసవత్తరమైన పోరాటం తప్పదని మోర్గాన్ తెలిపాడు. ఈ మ్యాచ్ లో న్యూజిలాండ్ ఫేవరేట్ అయినప్పటికీ ఆ ట్యాగ్ ను తాము పట్టించుకోమని చెప్పాడు.