: విమానం హైజాక్: స్త్రీ ప్రమేయం ఎప్పుడూ ఉంటుంద‌ని సైప్రస్‌ అధ్యక్షుడి వివాదాస్ప‌ద వ్యాఖ్య


అలెగ్జాండ్రియా నుంచి కైరో వ‌స్తున్న ఈజిప్ట్‌ విమానాన్ని ఈరోజు ఓ దుండ‌గుడు హైజాక్ చేసిన విష‌యం తెలిసిందే. అయితే ఈ విమానాన్ని హైజాక్ చేసిన దుండ‌గుడు త‌న మాజీ భార్యను కలిసేందుకు హైజాక్ చేశానని తెలిపాడు. దీనిపై సైప్రస్‌ అధ్యక్షుడు నికోస్‌ అనాస్తాసియాడేస్‌ మాట్లాడుతూ ప‌లు వ్యాఖ్య‌లు చేశారు. విమానం హైజాక్‌కి ఉగ్రవాదంతో సంబంధం లేదని తెలుపుతూ.. ఇలాంటి ఘ‌ట‌న‌ల్లో ‘స్త్రీ ప్రమేయం ఎప్పుడూ ఉంటుందని' న‌వ్వుతూ పేర్కొన్నారు. విమానంలో ఉన్న వారందరినీ సురక్షితంగా బయటకు తీసుకువచ్చేందుకు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నామని తెలిపారు. విమానం హైజాక్ లాంటి తీవ్రమైన ఘటనపై అధ్యక్షుడు నవ్వుతూ, సరదాగా స్పందించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

  • Loading...

More Telugu News