: ప్రముఖ సినీ నిర్మాత జయకృష్ణ కన్నుమూత
ప్రముఖ సినీ నిర్మాత జయకృష్ణ ఇకలేరు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఈరోజు హైదరాబాద్‌లో తుదిశ్వాస విడిచారు. మేకప్‌మెన్‌గా కెరీయర్ ప్రారంభించిన జయకృష్ణ ‘మన ఊరి పాండవులు', 'మంత్రిగారి వియ్యంకుడు', 'సీతారాములు', 'కృష్ణార్జునులు', 'వివాహభోజనంబు’ వంటి చిత్రాలకు నిర్మాతగా వ్యవహరించారు. కృష్ణంరాజు, జయప్రదకు పర్సనల్ మేకప్‌మ్యాన్‌గా పనిచేశారు. జయకృష్ణ నిర్మించిన చివరి సినిమా 'దాసు'. జయకృష్ణ సుదీర్ఘ విరామం తరువాత సినీనటి తారాచౌదరి జీవిత చరిత్రపై సినిమా నిర్మించాలని ప్రయత్నించారు. కాగా, అతని ఏకైక కుమారుడు ముద్దుకృష్ణ 2008లో ఆత్మహత్య చేసుకోవడం జయకృష్ణ జీవితంలో తీవ్ర విషాదాన్ని నింపిన విషయం తెలిసిందే.