: ప్రతిపక్షసభ్యులకు పాఠాలు చెప్పాల్సిందే, లేకపోతే రాష్ట్రాభివృద్ధి ఆగిపోతుంది: చంద్రబాబు
ప్రతిపక్షసభ్యులకు తెలియని విషయాలపై పాఠాలు చెప్పి తీరాల్సిందేనని, లేకపోతే, రాష్ట్రాభివృద్ధి ఆగిపోతుందని ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు అన్నారు. ఏపీ అసెంబ్లీలో జాతీయ ఉపాధి హామీ పథకంపై కనీస అవగాహన లేకుండా ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నారంటూ చంద్రబాబు విమర్శించారు. ఎస్సీ, ఎస్టీ సంక్షేమం, ఉపాధి హామీ పథకం, పోలవరం, పట్టిసీమ ప్రాజెక్టులపై కనీస అవగాహన లేకుండా జగన్ మాట్లాడటం మంచి పద్ధతి కాదని అన్నారు. ఈ అంశాల గురించి ప్రతిపక్షసభ్యులకు తెలియకపోతే సభను కొద్ది నిమిషాల పాటు వాయిదా వేసి, వాటి గురించి తెలియజెబుతామని బాబు అన్నారు. మాట్లాడే అంశం గురించి తెలియకపోతే హుందాగా వ్యవహరించాలి తప్ప, లేనిపోని ఆరోపణలు, అవాస్తవాలు మాట్లాడటం జగన్ కు తగదని చంద్రబాబు హితవు పలికారు.