: కోహ్లీ నెంబర్ వన్...అశ్విన్ నెంబర్ త్రీ
టీ20 వరల్డ్ కప్ లో భారత్ ను సెమీస్ కు చేర్చి దేశప్రజల కితాబులందుకున్న విరాట్ కోహ్లీ ఐసీసీ ర్యాంకింగ్స్ లో అగ్రస్థానానికి ఎగబాకాడు. ఆసియాకప్, టీ20 వరల్డ్ కప్ లో చేసిన ప్రదర్శనతో విరాట్ కోహ్లీ ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్ లో నెంబర్ వన్ గా ఉన్న ఆస్ట్రేలియా ఆటగాడు ఆరోన్ ఫించ్ ను వెనక్కి నెట్టాడు. దీంతో తాజా టీ20 వరల్డ్ నెంబర్ వన్ క్రీడాకారుడి ర్యాంక్ ను కోహ్లీ సొంతం చేసుకున్నాడు. టీ20 వరల్డ్ కప్ ప్రారంభం వరకు టీ20 నెంబర్ వన్ బౌలర్ గా ఉన్న రవిచంద్రన్ అశ్విన్ మూడో ర్యాంకుకు దిగజారాడు. బౌలింగ్ లో వరల్డ్ నెంబర్ వన్ ర్యాంకును వెస్టిండీస్ ఆటగాడు శామ్యూల్ బాద్రి చేజిక్కించుకున్నాడు. టీమ్ ర్యాంకింగ్స్ లో భారత జట్టు నెంబర్ వన్ గా కొనసాగుతోంది.