: ఒకేసారి 22 ఉపగ్రహాలు... చరిత్ర సృష్టించనున్న ఇస్రో!


భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) చరిత్ర సృష్టించనుంది. పీఎస్ ఎల్ వీ-సి 34 రాకెట్ ద్వారా 22 ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపించనుంది. మే నెలలో ఏపీలోని శ్రీహరి కోట నుంచి ఆ ఉపగ్రహాలను కక్ష్యలోకి ఇస్రో ప్రవేశపెట్టనుంది. ఈ సందర్భంగా ఇస్రోకు చెందిన విక్రమ్ సారాభాయ్ అంతరిక్ష కేంద్రం సంచాలకుడు కె.శివన్ మాట్లాడుతూ, భారత్ కు చెందిన కార్టోశాట్-2సి తో పాటు అమెరికా, కెనడా, ఇండోనేషియా, జర్మనీలకు చెందిన సూక్ష్మ, నానో ఉపగ్రహాలను ప్రయోగించనున్నట్లు చెప్పారు. 2008లో ఒకే ప్రయోగం ద్వారా పది ఉపగ్రహాలను కక్ష్యలోకి పంపించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. కాగా, 2013లో నాసా ఒకే రాకెట్ ద్వారా 29 ఉపగ్రహాలను ప్రయోగించి ప్రపంచ రికార్డును సాధించింది.

  • Loading...

More Telugu News