: అనుష్క వ్యవహారంలో కోహ్లీకి గవాస్కర్ మద్దతు


తన మాజీ ప్రియురాలు అనుష్కా శర్మపై సామాజిక మాధ్యమాల్లో వస్తున్న విమర్శల నేపథ్యంలో నెటిజన్లపై టీమిండియా క్రికెటర్ విరాట్ కోహ్లీ నిన్న మండిపడ్డ విషయం తెలిసిందే. తాజాగా, కోహ్లీకి మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ మద్దతుగా నిలిచారు. 'అనుష్క లవ్లీ గర్ల్' అంటూ ఆయన ప్రశంసించారు. సోషల్ మీడియాలో ఆమెపై వస్తున్న వ్యాఖ్యలు చికాకు కల్గిస్తున్నాయన్నారు. క్రికెటర్ గా, వ్యక్తిగా కోహ్లి ఎదుగుదలకు అనుష్క సానుకూల ప్రభావం చూపిందన్నారు. కాగా, కోహ్లీకి అనుష్క దూరమైన తర్వాతే అతని ఆటతీరు మెరుగుపడిందంటూ సామాజిక మాధ్యమాల్లో కామెంట్లు వెలువడిన విషయం తెలిసిందే. ఆమెపై ఇటువంటి వ్యాఖ్యలు తగదంటూ కోహ్లి ప్రతిస్పందించాడు.

  • Loading...

More Telugu News