: గేల్...నా కోరిక మన్నిస్తాడనే అనుకుంటున్నా: అమితాబ్


వెస్టిండీస్ స్టార్ క్రికెటర్ క్రిస్ గేల్ తన కోరిక మన్నిస్తాడని భావిస్తున్నానని బాలీవుడ్ షెహన్ షా అమితాబ్ బచ్చన్ తెలిపారు. అమితాబ్ కు గేల్ వీరాభిమాని. నిన్న అమితాబ్ ను గేల్ కలిశాడు. ఈ సందర్భంగా గేల్ పై అమితాబ్ ప్రశంసలు కురిపించారు. గేల్ చాలా హుందాగా వ్యవహరించాడని అమితాబ్ ట్విట్టర్లో పేర్కొన్నారు. గేల్ తన అభిమాని అన్న విషయం తనకు తెలియదని ఆయన పేర్కొన్నారు. అయితే తన కోరిక గేల్ తీరుస్తాడని ఆయన అభిప్రాయపడ్డారు. కాగా, గేల్ అమితాబ్ ను కలిసిన సందర్భంగా 'నువ్వు సెంచరీ కొట్టిన ఫర్వాలేదు కానీ, భారత్ మాత్రం గెలవాలని ఆకాంక్షించిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News