: మా బాస్ అమితాబ్ సెంచరీ చేయాలన్నారు...నేను మాత్రం అలా కోరుకోవడం లేదు: క్రిస్ గేల్


బాలీవుడ్ షెహన్ షా అమితాబ్ బచ్చన్ అంటే వెస్టిండీస్ హార్డ్ హిట్టర్ క్రిస్ గేల్ కి అంతులేని అభిమానం. ఆయన సినిమాలంటే పడి చస్తాడు. అమితాబ్ ను కలవాలనుందంటూ పలు సందర్భాల్లో టీమిండియా క్రికెటర్లను ట్విట్టర్ సాక్షిగా అడిగాడు. ఎట్టకేలకు తన అభిమాన నటుడు అమితాబ్ నుంచి ఆహ్వానం అందుకున్న గేల్...ఆయన ఆతిథ్యానికి మురిసిపోయాడు. 'మా బాస్' తన ఇంటికి ఆహ్వానించి మరీ ఆతిథ్యం ఇచ్చారని ఇన్ స్టా గ్రాం ద్వారా తెలిపాడు. ఆయన చాలా పుస్తకాలు ఇచ్చారు. 'నేను సెంచరీ కొట్టాలని కోరారు. కానీ ఇండియా గెలవాలని ఆకాంక్షించారు. నేను సెంచరీ కొట్టకపోయినా ఫర్వాలేదు. కానీ వెస్టిండీస్ జట్టు గెలవాలి' అని గేల్ అన్నాడు.

  • Loading...

More Telugu News