: చిన్నకూతురు పెళ్లి వేడుకల్లో చిందేసిన చిరంజీవి
మెగాస్టార్ చిరంజీవి చిన్న కూతురు శ్రీజ వివాహ వేడుకల్లో చిరు స్టెప్పులేశారు. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. పెద్దకూతురు సుస్మితతో కలిసి చిరంజీవి డ్యాన్స్ చేస్తూ ఈ వీడియోలో కనిపించారు. ‘మళ్లీ మళ్లీ ఇది రానిరోజు’ అనే పాటకు వాళ్లిద్దరూ ఆడిపాడారు. కాగా, బెంగళూరులోని చిరంజీవి ఫాం హౌస్ లో శ్రీజ పెళ్లి వేడుకలు నిన్న ఘనంగా జరిగాయి. మెగాస్టార్ కుటుంబసభ్యులతో పాటు అత్యంత సన్నిహితులు మాత్రమే ఈ వివాహ వేడుకలకు హాజరైనట్లు సమాచారం.