: సినిమా టిక్కెట్ల ధరలు పెంచుతూ జీవో జారీ
రాష్ట్రంలో సినిమా టిక్కెట్ల ధరలు పెరగబోతున్నాయి. ఈ మేరకు ప్రభుత్వం ఓ జీవో జారీ చేసింది. ఈ క్రమంలో సినిమా హాళ్లు, మల్టీ ఫ్లెక్సులను ఐదు కేటగిరీలుగా విభజించింది. పెరిగిన ధరలు వెంటనే అమల్లోకి రానున్నాయని స్పష్టంగా తెలుస్తోంది. దాంతో పాటు సినిమా హాళ్లు, మల్టీఫెక్సులకు ప్రభుత్వం కొత్త నిబంధనలు విధించింది. ట్రాఫిక్ కు అంతరాయం కలగకుండా పార్కింగ్ సదుపాయాలు థియేటర్ల యజమానులే కల్పించాలని ప్రభుత్వం చెప్పింది. థియేటర్లలో కూల్ డ్రింక్స్, ఇతర తిను బండారాలను అధిక ధరలకు అమ్మితే కఠిన చర్యలు తప్పవని హెచ్చిరించింది.