: క్యారీ బ్యాగుల మీద వినూత్న ప్ర‌చారం


ఎన్నికల్లో తమకు ఓట్లడుగుతూ అభ్యర్థులు వినూత్న రీతిలో ప్రచారం చేస్తారన్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఓటు హ‌క్కు వినియోగంపై అవగాహన కల్పించేందుకు ఎన్నిక‌ల సంఘం కూడా వినూత్న మార్గాన్ని ఎంచుకుంది. ఎన్నికల్లో అందరూ ఓటుహక్కు వినియోగించుకోవాలంటూ.. త్వరలో తమిళనాడులో జరగబోయే ఎన్నికల కోసం ఎన్నికల సంఘం ప్రచారం ప్రారంభించింది. బిగ్‌ బజార్‌ లాంటి మెగామాల్స్‌లో క్యారీ బ్యాగుల మీద, పలు టెక్స్‌టైల్‌ దుకాణాలు, గొలుసు రెస్టారెంట్ల క్యారీ బ్యాగుల మీదా ఎన్నికల తేదీల్ని పెద్ద సైజులో కనిపించేట్టు స్టిక్కర్లు వేయించింది. ఈ విషయమై తొలుత బిగ్‌ బజార్‌ని సంప్రదించామ‌ని ఎన్నికల అధికారి రాజేశ్‌ లఖానీ అన్నారు. అయితే తమ క్యారీ బ్యాగులన్నీ చైనాలో తయారవుతాయని, ఆరు నెలలకు సరిపడా స్టాక్‌ తమ వద్ద ఉంటుందని ఆ సంస్థ చెప్పిన‌ట్లు తెలిపారు. చివరికి ఆ క్యారీబ్యాగుల మీద ఎన్నికల తేదీ స్టిక్కర్లను అంటించేందుకు వారి నుంచి అనుమతి తీసుకున్నట్లు వివ‌రించారు. దీనితోపాటు మరో 23 పెద్ద స్థాయి దుకాణాలు ఇందుకు ఒప్పుకున్నాయి. ఎన్నికల్లో అందరూ ఓటుహక్కు వినియోగించుకోవాలంటూ.. ఎన్నికల తేదీని పేర్కొంటూ ప్రింట్‌ చేయించిన క్యారీ బ్యాగుల‌తో ఈసీ ప్రచారాన్ని నిర్వ‌హిస్తోంది.

  • Loading...

More Telugu News