: ‘బాహుబలి’కి కేసీఆర్ అభినందన... తెలంగాణ అసెంబ్లీ కూడా!
భారతీయ చలన చిత్ర రికార్డులను తిరగరాసిన టాలీవుడ్ హిట్ మూవీ ‘బాహుబలి’కి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. నిన్న కేంద్రం ప్రకటించిన 63వ జాతీయ చలన చిత్ర అవార్డుల్లో భాగంగా ‘బాహుబలి’ ఉత్తమ చిత్రంగా ఎంపికైన సంగతి తెలిసిందే. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని నేటి ఉదయం తెలంగాణ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖరరావు ప్రత్యేకంగా అభినందలు తెలిపారు. జాతీయ ఉత్తమ చిత్రంగా ఎంపికై, తెలుగు చలన చిత్ర పరిశ్రమ సత్తాను చాటారని ఆయన కీర్తించారు. ఇక జాతీయ అవార్డును దక్కించుకున్న ‘బాహుబలి’కి తెలంగాణ అసెంబ్లీ కూడా అభినందనలు తెలుపుతూ తీర్మానాన్ని ఆమోదించింది.