: లోకేశ్ కోసం జూనియర్ ఎన్టీఆర్‌ను తొక్కేస్తున్నారు: రోజా


ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడి కుమారుడు లోకేశ్ ఎదగలేడన్న భయంతో.. జూనియర్ ఎన్టీఆర్‌ను తొక్కేశారని వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే రోజా విమర్శించారు. జూనియర్ ఎన్టీఆర్ సినిమాలు విడుదల కానివ్వకుండా, ఆడనివ్వకుండా ఉక్కు పాదంతో తొక్కేస్తున్నారని మండిపడ్డారు. హైకోర్టు డివిజన్ బెంచి ఇచ్చిన ఉత్తర్వులను సుప్రీంకోర్టులో సవాలు చేసిన సందర్భంగా ఆమె కోర్టు వెలుపల మీడియాతో మాట్లాడారు. జూనియర్ ఎన్టీఆర్‌ను ఎన్నికల సమయంలో ప్రచారానికి వాడుకుని, ఆ తర్వాత టీడీపీలో కార్యకర్తగా కూడా ఉండనివ్వకుండా తరిమేశారని అన్నారు.

  • Loading...

More Telugu News