: నాకొచ్చింది... మీకు రాలేదుగా: తలసాని వ్యాఖ్యలకు గోరంట్ల, కళా చిరునవ్వులు!
ఒకప్పుడు తెలుగుదేశం నేత, ఇప్పటి టీఆర్ఎస్ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్, ఏపీ టీడీపీ నేతలు గోరంట్ల బుచ్చయ్య చౌదరి, కళా వెంకట్రావులు ఈ ఉదయం అసెంబ్లీలో తారసపడిన వేళ, వారిమధ్య ఆసక్తికర సంభాషణ జరిగింది. గోరంట్ల, వెంకట్రావులతో ముచ్చట పెట్టుకున్న తలసాని, తనకు టీఆర్ఎస్ పార్టీ మంత్రి పదవి ఇచ్చిందని, అధికారంలో ఉన్నప్పటికీ, మీకు పదవులు రాలేదుగా? అని తలసాని అనగా, ఏం సమాధానం చెప్పాలో తోచని ఇద్దరు నేతలూ చిరు నవ్వులు చిందిస్తూ వెళ్లిపోయారు. కాగా, అసెంబ్లీ లాబీల్లో ఏ ఇద్దరు నేతలు కలిసినా, ఏపీలో జరుగుతున్న ఫిరాయింపులపైనే చర్చలు జరుగుతున్నట్టు తెలుస్తోంది.