: షూటింగులో తమిళ స్టార్ జీవీ ప్రకాష్ కు గాయాలు
తమిళ చిత్రసీమలో సినీ సంగీత దర్శకుడిగా కెరీర్ ప్రారంభించి, ఆపై హీరోగా మారిన జీవీ ప్రకాష్ కుమార్, 'కడవుల్ ఇరుక్కన్ కుమార' పేరిట నిర్మిస్తున్న చిత్రం షూటింగ్ లో గాయపడ్డారు. పాండిచ్చేరీలో చిత్రం ఫైటింగ్ సీన్స్ తీస్తుండగా ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో స్వల్పగాయాలతో ప్రకాష్ తప్పించుకున్నారని తెలుస్తోంది. ప్రకాష్, బాలాజీలపై దర్శకుడు రాజేష్ ఓ పోరాటాన్ని చిత్రీకరిస్తుండగా యాక్సిడెంట్ జరిగిందని సినిమా యూనిట్ వెల్లడించింది. కాగా, ఈ చిత్రంలో అవికాగోర్, నిక్కీ గల్రానీ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ప్రకాష్ నటించిన తాజా తమిళ చిత్రం 'నాకు ఇంకో పేరుంది' పేరిట డబ్బింగ్ పూర్తి చేసుకుని తెలుగులో విడుదలకు సిద్ధంగా ఉన్న సంగతి తెలిసిందే.