: ఏపీ అసెంబ్లీ సమావేశాలు: వైసీపీ సభ్యుల నిరసన, వాకౌట్
ఆంధ్రప్రదేశ్ శాసన సభ సమావేశాల్లో ఈరోజు కూడా రగడ కొనసాగింది. స్పీకర్ కోడెల శివప్రసాద్ సభను ప్రారంభించిన అనంతరం సభలో ప్రశ్నోత్తరాలు కొనసాగాయి. శాసనసభ సమావేశాల నుంచి ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు వాకౌట్ చేశారు. కరవు సహాయక చర్యలలో ప్రభుత్వ వైఫల్యాన్ని నిరసిస్తూ సభ నుంచి వాకౌట్ చేశారు. మరోవైపు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి తెలుగుదేశంలోకి చేరిన వారిని ఇరుకున పెట్టేందుకు ద్రవ్య వినిమయ బిల్లు విషయంలో వైసీపీ విప్ జారీ చేసిన సంగతి తెలిసిందే.