: రూ.20 కోట్లిస్తామన్నారు!... టీడీపీ ‘ఆకర్ష్’ పై వైసీపీ మహిళా ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్య


ఏపీలో అధికార పార్టీ టీడీపీ చేపట్టిన ‘ఆకర్ష్’పై విపక్ష వైసీపీకి చెందిన మరో ఎమ్మెల్యే సంచలన ఆరోపణలు గుప్పించారు. నేటి అసెంబ్లీ సమావేశాలకు వచ్చిన సందర్భంగా అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద వైసీపీ మహిళా నేత, రంపచోడవరం ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి ఓ న్యూస్ ఛానెల్ తో మాట్లాడారు. పార్టీ మారితే రూ.20 కోట్లిస్తామని టీడీపీ నేతలు తనను ప్రలోభపెట్టేందుకు యత్నించారని ఆమె ఆరోపించారు. అయితే తాను డబ్బుకు లొంగే మనిషిని కాదని స్పష్టం చేశానని కూడా ఆమె పేర్కొన్నారు. ఎవరెన్ని ప్రలోభాలకు గురి చేసినా పార్టీ మారే ప్రసక్తి లేదని కూడా తేల్చిచెప్పారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వల్లే తాను ఎమ్మెల్యేగా గెలిచానని, కడవరకు తాను వైసీపీలోనే కొనసాగుతానని తెలిపారు. తాను పార్టీ మారతానంటూ కొన్ని పత్రికలు, వార్తా ఛానెళ్లు అసత్య ప్రచారం చేస్తున్నాయని ఆమె మండిపడ్డారు.

  • Loading...

More Telugu News