: నాకు రెండు రాష్ట్రాలూ కావాలి: చంద్రబాబు


ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు తనకు రెండు కళ్లని, ఇరు రాష్ట్రాల అభివృద్ధికీ తాను కృషి చేస్తానని ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు వ్యాఖ్యానించారు. ఈ ఉదయం తెలుగుదేశం పార్టీ 35వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో ప్రారంభం కాగా, చంద్రబాబు పాల్గొన్నారు. పతాకావిష్కరణ అనంతరం ఆయన మాట్లాడుతూ, తెలుగుదేశం ఆవిర్భావమే ఓ చరిత్రని వ్యాఖ్యానించారు. ఎన్ని సమస్యలు ఎదురైనా, ఒడిదుడుకులు వచ్చినా తట్టుకుని పార్టీ నిలబడిందంటే, అందుకు కార్యకర్తల కృషే కారణమని అన్నారు. తెలుగువారికి అన్ని రంగాల్లో న్యాయం జరగాలన్నదే తన లక్ష్యమని పేర్కొన్న చంద్రబాబు, ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పార్టీ కార్యకర్తలకు, అభిమానులకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. ఎన్టీఆర్ యుగపురుషుడని, తెలుగువారి ఆత్మగౌరవాన్ని కాపాడేందుకే ఆయన పార్టీని ప్రారంభించారని గుర్తు చేసుకున్నారు. బడుగు, బలహీన వర్గాలకు రాజకీయ చరిత్రను సృష్టించిన పార్టీ టీడీపీయేనని వివరించారు. ఓ ప్రాంతీయ పార్టీగా పుట్టిన పార్టీ దేశ రాజకీయాలనే శాసించే స్థాయికి ఎదిగిందని అన్నారు. కాగా, సాయంత్రం 5 గంటలకు ట్రస్ట్ భవన్ లో ఆవిర్భావ వేడుకల సభను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.

  • Loading...

More Telugu News