: ఇకపై వాట్స్ యాప్ నుంచి ల్యాండ్ లైన్ కూ కాల్స్!
వాట్స్ యాప్, స్కైపే, వైబర్ వంటి పాప్యులర్ యాప్స్ వాడుతున్న వారికి శుభవార్త. మీ యాప్స్ నుంచి ల్యాండ్ లైన్ తో పాటు మొబైల్ ఫోన్ నెంబర్లకు ఫోన్ కాల్స్ చేసుకోవచ్చు. ఈ మేరకు ఐఎస్పీలు (ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్స్), టెలికం ఆపరేటర్ల మధ్య క్లియరెన్స్ ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం కారణంగా వాయిస్ కాల్స్ చార్జీలు గణనీయంగా తగ్గనున్నాయి. వాస్తవానికి ఇంటర్నెట్ నెట్ వర్క్ ల మధ్య నాణ్యమైన సిగ్నల్స్ లేని కారణంగా వాట్స్ యాప్ వంటి సామాజిక మాధ్యమాల నుంచి చేసే కాల్స్ క్లియర్ గా ఉండటం లేదని స్మార్ట్ ఫోన్ వాడకం దారుల నుంచి వేలకొద్దీ ఫిర్యాదులు వస్తున్న సంగతి తెలిసిందే. ఐఎస్పీలు, టెల్కోల మధ్య డీల్ తరువాత ఈ తరహా సమస్యలు తగ్గుతాయని నిపుణులు వ్యాఖ్యానించారు.