: ఆల్వాల్ లో ఘోరం... రైల్వే బ్రిడ్జ్ పై నుంచి పడ్డ కారు, బైక్...ముగ్గురు మృతి!
హైదరాబాద్ పరిధిలోని ఆల్వాల్ లో ఈ ఉదయం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా, ఏడుగురు గాయపడ్డారు. ఏపీ 29 బీబీ 4454 నెంబరు గల కారులో కర్మన్ ఘాట్ కు చెందిన కృష్ణమాచార్య కుటుంబం బంధువుల ఇంట శుభకార్యానికి వెళ్లి వస్తుండగా, ఈ ప్రమాదం జరిగింది. రైల్వే వంతనపై ఓ బైకును వీరు ప్రయాణిస్తున్న కారు ఢీ కొనగా, కారు వంతెనపై నుంచి కిందపడింది. ప్రమాదంలో కృష్ణమాచార్యతో పాటు కమలిని, బైకర్ శక్తిసింగ్, మరణించారు. ఘటనా స్థలిని సందర్శించిన పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. బైక్ రాంగ్ రూట్ లో వేగంగా రావడమే ప్రమాదానికి కారణమని తెలుస్తోంది.