: ఇకపై ఎమర్జన్సీ సేవలకు '112' వచ్చేస్తోంది!
పోలీసులకు కాల్ చేయాలంటే 100, ఫైర్ సర్వీసయితే 101, అంబులెన్స్ కు 102, విపత్తులు సంభవిస్తే 108... ఇలా ఒక్కో ఆపదకు ఒక్కో అత్యవసర నంబర్ ను డయల్ చేయాల్సిన అవసరం ఇకపై తప్పనుంది. ఏ ఎమర్జెన్సీకయినా '112' నెంబరుకు ఫోన్ చేయడం ద్వారా సేవలు పొందేలా ట్రాయ్ (టెలికం రెగ్యులేటరీ అధారిటీ) సిఫార్సులకు ఇంటర్ మినిస్టీరియల్ టెలికం కమిషన్ ఆమోదించింది. ఇక ఈ సిఫార్సులకు టెలికం మంత్రిత్వ శాఖ ఆమోదం పడటమే తరువాయి. ఆపై 112 అందుబాటులోకి వస్తుంది. యూఎస్ లో ఎమర్జెన్సీ నంబర్ 911 మాదిరిగానే ఇది కూడా పనిచేస్తుంది.