: మనీశ్ పాండేకు పిలుపు... సెమీస్ లో యువీ లేనట్టే!


ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్ లో కాలి మడమకు గాయమై క్రీజులో ఉన్నంత సేపూ కష్టంగా ఆడిన యువరాజ్ సింగ్, సెమీఫైనల్ పోరుకు ఆడే అవకాశాలు లేనట్టే కనిపిస్తోంది. ఆయనకు ఎంఆర్ఐ స్కాన్ చేసిన వైద్యులు గాయం ప్రభావం అధికమేనని వెల్లడించినట్టు సమాచారం. దీంతో, బీసీసీఐ సెలక్షన్ కమిటీ ముందు జాగ్రత్తగా మనీశ్ పాండేను జట్టులోకి పిలిపించింది. గురువారం వెస్టిండీస్ తో సెమీఫైనల్ మ్యాచ్ ఆడాల్సి వుండగా, ఆ సమయానికి యువరాజ్ కోలుకోకుంటే బెంచ్ లో ఉన్న అజింక్యా రహానే లేదా మనీశ్ పాండేల్లో ఒకరు తుది జట్టులో చేరే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. కాగా, పిచ్ స్వభావాన్ని బట్టి మార్పు చేర్పులకు అవకాశాలు ఉంటాయని కెప్టెన్ ధోనీ వ్యాఖ్యానించాడు.

  • Loading...

More Telugu News