: మిగిలింది ముగ్గురమే అయినా చెప్పాలనుకున్నది చెప్పగలుగుతున్నాం!: రేవంత్ రెడ్డి


"తెలంగాణ శాసనసభలో ముగ్గురమే మిగిలాం. అయినప్పటికీ చెప్పాలనుకున్నది స్పష్టంగా చెబుతున్నాం. ఇంతకుముందు 15 మంది ఉన్నప్పుడు మాకు అవకాశాలు దక్కనీయకుండా టీఆర్ఎస్ అడ్డుకునేది. ఇప్పుడు ప్రజాసమస్యలపై మా గళాన్ని విప్పుతున్నాం" అని తెలుగుదేశం పార్టీ శాసనసభా పక్ష నేత రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. అసెంబ్లీ లాబీల్లో మీడియాతో మాట్లాడుతూ, వెళ్లాలని అనుకున్న వారంతా వెళ్లిపోవడంతో గందరగోళం పోయిందని, ఎవరు పార్టీకి విధేయులో అందరికీ తెలిసి వచ్చిందని అన్నారు. ఈ సందర్భంగా లాబీల్లో ఓ ఆసక్తికర ఘటన జరిగింది. రేవంత్ ఉన్న ప్రాంతంవైపు ఎర్రబెల్లి దయాకర్ వస్తుండటంతో, రేవంత్ ఆయన్ని ఆహ్వానించారు. ఎర్రబెల్లి మాత్రం పక్కనే ఉన్న హరీశ్ రావు కార్యాలయంలోకి వెళ్లేందుకు చూశారు. అక్కడ ఎవరూ లేరని తెలుసుకుని, చిరునవ్వుతో నమస్కారం చేస్తూ ఆగకుండా హాల్ లోకి వెళ్లిపోయారు.

  • Loading...

More Telugu News