: వికెట్ కోల్పోయి 50 పరుగులు చేసిన సౌతాఫ్రికా
టీ20 వరల్డ్ కప్ గ్రూప్ 'ఏ'లో మూడవ స్థానం కోసం జరిగిన పోరులో సౌతాఫ్రికా జట్టు ఆకట్టుకుంది. ఇప్పటికే వరల్డ్ కప్ నుంచి నిష్క్రమించిన శ్రీలంక, సౌతాఫ్రికా జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో సౌతాఫ్రికా ఎప్పట్లానే సాధికారిక ఆటతీరు కనబర్చింది. 121 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ఆరంభించిన సఫారీలకు ఆదిలోని షాక్ తగిలింది. అమ్లా (26) ఇచ్చిన పిలుపుకు స్పందించిన డికాక్ (9) రనౌట్ గా వెనుదిరిగాడు. అనంతరం వచ్చిన డుప్లెసిస్ (13) ఆకట్టుకోవడంతో పది ఓవర్లలో సఫారీలు ఏభై పరుగులు రీ సాధించారు.