: కండక్టర్ టికెట్ల బాక్స్ లో దుప్పి మాంసం
ఆర్టీసీ బస్సు కండక్టర్ టికెట్ల బాక్స్ లో దుప్పిమాంసం దర్శనమిచ్చిన సంఘటన మహబూబ్ నగర్ జిల్లాలో జరిగింది. లింగాల అటవీ శాఖ రేంజర్ చంద్రమోహన్ తెలిపిన వివరాల ప్రకారం, అచ్చంపేట డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ఈరోజు ఉదయం అచ్చంపేట నుంచి అప్పాయిపల్లికి బయలుదేరింది. తిరుగుప్రయాణంలో బస్సులో దుప్పి మాంసం ఉందన్న సమాచారం మేరకు బల్మూర్ మండలం అనంతవరం గ్రామం వద్ద ఆ బస్సులో తనిఖీలు చేపట్టారు. కండక్టర్ టికెట్ల బాక్స్ లో దుప్పి మాంసం ఉండటం గుర్తించిన అధికారులు స్వాధీనం చేసుకుని, కండక్టర్ చంద్రయ్యకు రూ.15,000 జరిమానా విధించారు.