: ఆమె నిజంగానే అనుకోకుండా సినిమాల్లోకి ప్రవేశించింది!


అనుకోకుండా హీరోయిన్ అయ్యానంటూ అలనాటి నటీమణులు చాలా మంది చెబుతుండేవారు. అయితే వాళ్ల సంగతేమో కానీ హాలీవుడ్ నటి డెబ్బీ రెనాల్డ్స్ మాత్రం కాకతాళీయంగా సినీ రంగప్రవేశం చేసింది. ఆమె హాలీవుడ్ ప్రవేశానికి ముందు, సొంత ఊరు బర్బంక్ లో అందాల పోటీలు జరుగుతున్నాయంటూ వచ్చిన ఓ ప్రకటనను ఆమె చూసింది. 'ఈ పోటీల్లో పాల్గొనే వారికి ఒక స్కార్ఫ్, ఒక బ్లౌజ్, ఒక పూట భోజనం పెడతామ'ని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. ఈ ఉచిత స్కార్ఫ్ అనేది డెబ్బీని బాగా ఆకట్టుకుంది. పోటీల్లో పాల్గొని స్కార్ఫ్ తెచ్చుకుందామని స్నేహితురాలితో కలిసి వెళ్ళింది. విచిత్రం ఏమిటంటే, చివరికి ఈ పోటీల్లో డెబ్బీ విజేతగా నిలిచింది. దీనిని పత్రికల్లో చూసిన వార్నర్ బ్రదర్స్ డెబ్బీని కలిసి స్క్రీన్ టెస్ట్ చేశారు. అంతే, ఆమె హాలీవుడ్ నటిగా వెలుగొందింది. అలా ఆమె అనుకోకుండా సినిమాల్లో ప్రవేశించి, ఆ రంగంలో తనదైన ముద్ర వేసింది.

  • Loading...

More Telugu News