: ‘బాహుబలి’కి అవార్డు తెలుగుజాతికి గర్వకారణం: దర్శక నిర్మాత అల్లాణి శ్రీధర్


‘బాహుబలి’ జాతీయ ఉత్తమ చిత్రంగా ఎంపిక కావడం తెలుగు జాతికి గర్వకారణమని దర్శక నిర్మాత అల్లాణి శ్రీధర్ అన్నారు. ఈ సందర్భంగా దర్శకుడు రాజమౌళిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానని అన్నారు. తెలుగువారికి ‘మాయాబజార్’ ఎలాగో ‘బాహుబలి’ కూడా అలాంటి అజరామర చిత్రమేనని ఆయన ప్రశంసించారు. ఇదే స్ఫూర్తితో మరెన్నో ఉన్నత స్థాయి చిత్రాలు రూపొందాలని ఆకాంక్షిస్తున్నానని అన్నారు. సృజనాత్మకంగానే కాకుండా వ్యాపారపరంగా కూడా రికార్డులు సృష్టించిన ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా వందల కోట్లు వసూలు చేయడంపై శ్రీధర్ హర్షం వ్యక్తం చేశారు.

  • Loading...

More Telugu News