: గన్నవరం విమానాశ్రయంలో అందుబాటులోకి రానున్న కొత్త సర్వీసు
ప్రయాణికుల సౌకర్యార్థం ఆంధ్రప్రదేశ్ లోని గన్నవరం విమానాశ్రయంలో కొత్త విమానం సర్వీసు అందుబాటులోకి రానుందని టీడీపీ ఎంపీ కేశినేని నాని పేర్కొన్నారు. ఏప్రిల్ 15 నుంచి సాయంత్రం 6.50 గంటలకు ఢిల్లీలో బయలుదేరే ఈ విమానం రాత్రి 9.10 గంటలకు గన్నవరం చేరుకుంటుంది. మళ్లీ గన్నవరం నుంచి రాత్రి 9.50 గంటలకు బయలుదేరి 12 గంటలకు ఢిల్లీ చేరుకుంటుందని అంతర్జాతీయ ప్రయాణికులను దృష్టిలో పెట్టుకుని ఈ విమానం అందుబాటులోకి రానుందని కేశినేని నాని చెప్పారు.