: ఏఎస్ రావునగర్ లో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ ఆత్మహత్య
హైదరాబాదులోని ఏఎస్ రావునగర్ లో సెల్వర్ అనే సాఫ్ట్ వేర్ ఇంజనీర్ ఆత్మహత్యకు పాల్పడింది. సంఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు ప్రాథమిక విచారణ చేసి, ఆమె భౌతిక కాయాన్ని పోస్ట్ మార్టంకు పంపించారు. కాగా, డెలాయిట్ లో ఓ వ్యక్తిని ప్రేమించిన సెల్వర్...అతను వివాహానికి నిరాకరించడంతో ఆత్మహత్యకు పాల్పడినట్టు పోలీసులు గుర్తించారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు, విచారణ ప్రారంభించారు.