: శ్వేతసౌధంలో ఈస్టర్ వేడుకలు...వేలాదిగా హాజరైన ప్రముఖులు


అమెరికా అధ్యక్ష భవనం శ్వేతసౌధంలో ఈస్టర్ వేడుకలు ఘనంగా జరిగాయి. అక్కడి పచ్చికమైదానంలో ఈ వేడుకలు అట్టహాసంగా ప్రారంభం కాగా, వాటిలో పాల్గొనేందుకు హాలీవుడ్ నటులు, ప్రముఖులు, ప్రజలు ఉత్సాహం చూపారు. సుమారు 35 వేల మంది ఔత్సాహికులు ఇందులో పాల్గొనేందుకు శ్వేతసౌధం అనుమతి ఇచ్చిందని అధికారులు తెలిపారు. ఇందులో పాల్గొనేందుకు వివిధ వేషధారణల్లో ఔత్సాహికులు హాజరయ్యారు. సంగీతం, విందు, ఆటలు, నృత్యాలతో ఈస్టర్ వేడుకలు జరగనున్నాయి. ఈ వేడుకల్లో అధ్యక్ష దంపతులు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నారు.

  • Loading...

More Telugu News