: మహిళల నుంచి 96 లక్షల రూపాయల విలువైన విదేశీ కరెన్సీ స్వాధీనం
అక్రమంగా విదేశీ కరెన్సీని తరలిస్తున్న ఇద్దరు మహిళలను శంషాబాద్ లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయ డీఆర్ఐ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఆ ఇద్దరు మహిళల నుంచి నాలుగు దేశాలకు చెందిన 96 లక్షల రూపాయల విలువైన కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు. ఇందులో సౌదీ అరేబియా, దుబాయ్, బహ్రెయిన్ లకు చెందిన కరెన్సీ లభ్యమైంది. ప్రస్తుతం ఆ మహిళలను విచారిస్తున్నారు.