: టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న సఫారీలు...శ్రీలంక 34


టీ20 వరల్డ్ కప్ లో భాగంగా మొహాలీ వేదికగా టీ20 మ్యాచ్ ప్రారంభమైంది. టాస్ గెలిచిన సౌతాఫ్రికా జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో శ్రీలంక జట్టు బ్యాటింగ్ ప్రారంభించింది. గ్రూప్ ఏ లో సెమీఫైనల్ లో స్థానం కోసం జరుగుతున్న ఈ మ్యాచ్ లో విజయం సాధించడం రెండు జట్లకు కీలకం. దీంతో రెండు జట్లు విజయమే లక్ష్యంగా ఆడుతున్నాయి. సఫారీ బౌలర్లపై చండిమాల్ (21) విరుచుకుపడుతుండగా, దిల్షాన్ (6) ఆచితూచి ఆడుతున్నాడు. దీంతో నాలుగు ఓవర్లు ముగిసేసరికి వికెట్లేమీ కోల్పోని శ్రీలంక జట్టు 34 పరుగులు చేసింది.

  • Loading...

More Telugu News