: ఐఎస్ఐఎస్ రాజధానికి 4 కిలోమీటర్ల దూరంలో సిరియా దళాలు
ఐఎస్ఐఎస్ రాజధాని సిరియాలోని అల్ రఖా నగరానికి 4 కిలోమీటర్ల దూరంలో కుర్దు, సిరియా, క్రైస్తవ సేనలు పాగావేశాయి. ఖలీఫా రాజ్య స్థాపన ధ్యేయంగా దాడులు చేస్తూ ప్రపంచానికి సవాల్ విసురుతున్న ఐఎస్ఐఎస్ ను తుదముట్టించేందుకు సిరియా డెమొక్రాటిక్ దళాలు ఎదురుదాడులు ప్రారంభించాయి. దీంతో వారు ఆక్రమించుకున్న కొబానీ నగరాన్ని కుర్దులు విడిపించుకున్నారు. దీంతో ఐఎస్ఐఎస్ పతనం ప్రారంభమైంది. అనంతరం ఇరాక్ లోని రమదా నగరాన్ని ఇరాకీ సేనలు విడిపించుకున్నాయి. ఆ తరువాత చారిత్రక పట్టనమైన పాల్మైరా నగరాన్ని సిరియా దళాలు స్వాధీనం చేసుకున్నారు. తాజగా టెల్ అబయద్ నగరాన్ని సిరియా డెమొక్రాటిక్ దళాలు స్వాధీనం చేసుకున్నాయి. నగరం చుట్టూ కంచెను సైన్యం ఏర్పాటు చేసింది. అక్కడి నుంచి అల్ మల్హా గ్రామానికి సిరియా దళాలు చేరుకున్నాయి. అక్కడి నుంచి ఐఎస్ఐఎస్ రాజధాని అల్ రకా కేవలం నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉంది. ఒక్క అల్ రకా నగరాన్ని స్వాధీనం చేసుకుంటే ఐసిస్ రాజ్యాన్ని ఇంచుమించు స్వాధీనం చేసుకున్నట్టే. వాయు మార్గంలో అమెరికా, రష్యా, బ్రిటన్ దళాలు దాడులు చేస్తుండగా, భూ ఉపరితం నుంచి కుర్దు, సిరియా, క్రైస్తవ దళాలు విరుచుకుపడుతున్నాయి. దీంతో ఐసిస్ తోకముడుస్తోంది.