: తల్లిపాలు, వ్యాక్సినేషన్స్ తో శిశువుల్లో చెవి ఇన్ఫెక్షన్లు తగ్గుముఖం: తాజా అధ్యయనం


పిల్లలకు తల్లిపాలివ్వడం, వ్యాక్సినేషన్లు వేయించడం వంటి వాటితో ఏడాది శిశువుల్లో చెవులకు సంబంధించిన ఇన్ఫెక్షన్లు వచ్చే శాతం తగ్గుతుందని ఒక కొత్త అధ్యయనంలో తేలింది. అమెరికాలోని యూనివర్శిటీ ఆఫ్ టెక్సాస్ లో ఈ మేరకు ఒక అధ్యయనం నిర్వహించారు. శిశువులకు తల్లిపాలివ్వడమనేది జలుబు, చెవి ఇన్ఫెక్షన్లతో ముడిపడి ఉందని, గుర్తించదగిన స్థాయిలో ఆ ఇన్ఫెక్షన్లు దరిచేరే శాతం తగ్గుతుందని అధ్యయన బృందానికి నాయకత్వం వహించిన ప్రొఫెసర్ టాన్సీ చోన్ మెయిత్రీ పేర్కొన్నారు. ఒక నెల కన్నా తక్కువ వయస్సు ఉన్న 367 మంది శిశువులను ఈ అధ్యయనంలో భాగంగా అక్టోబరు 2008 నుంచి మార్చి 2014 వరకు పరీక్షించారు. శిశువుల ముక్కు, గొంతుకు సంబంధించి మ్యూకస్ శాంపిల్స్ ను సేకరించి పరీక్షించడంతో ఈ కొత్త విషయాలు వెలుగుచూశాయి.

  • Loading...

More Telugu News