: అగ్రిగోల్డ్ వ్యవహారంలో... జగన్ వర్సెస్ అచ్చెన్నాయుడు


అగ్రిగోల్డ్ నిందితులను ప్రభుత్వమే కాపాడుతోందని వైఎస్సార్సీపీ అధినేత జగన్ ఆరోపించారు. రెండు వేల కోట్ల శారదా కుంభకోణంలో సీబీఐ ఎంక్వయిరీ వేయిస్తే...ఆరు వేల కోట్ల రూపాయల కుంభకోణం అగ్రిగోల్డ్ విచారణలో సీబీఐతో విచారణ చేయించకుండా సీఐడీతో విచారణ చేయించిందని అన్నారు. అంతటితో ఆగని ప్రభుత్వం ఈ కేసులో విచారణ సందర్భంగా సాక్షాత్తూ కోర్టు ముందు సీఐడీ విచారణాధికారితో అగ్రిగోల్డ్ నిందితులను అరెస్టు చేయాల్సిన అవసరం లేదని వాదించారని తెలిపారు. 40 లక్షల మంది డబ్బు కోల్పోయి ఇబ్బంది పడుతుంటే వారికి న్యాయం చేయడంలో ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తోందని ఆయన మండిపడ్డారు. ఈ సందర్భంగా మంత్రి అచ్చెన్నాయుడు వివరణ ఇస్తూ...తాము నిందితులను రక్షించే ప్రయత్నం చేయడం లేదని అన్నారు. అగ్రిగోల్డ్ నిందితులను కాపాడుతున్నట్టు ఏవైనా ఆధారాలు ఉంటే ప్రభుత్వానికి ఇవ్వాలని కోరారు. వారిపై తగిన చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు. అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేయడానికే సీఐడీ విచారణ వేశామని ఆయన చెప్పారు. సీబీఐ విచారణ చేస్తే బాధితులకు న్యాయం చేయడంలో ఆలస్యమవుతుందని ఆయన తెలిపారు. అందుకే సీఐడీ విచారణకు ఆదేశించామని ఆయన చెప్పారు. అలా కాకుండా అగ్రిగోల్డ్ బాధితుల తరపున వకాల్తా పుచ్చుకుంటామని ప్రతిపక్ష పార్టీ హామీ ఇస్తే...ఈ కేసును సీబీఐకి అప్పగించేందుకు ఎలాంటి అభ్యంతరం లేదని ఆయన తెలిపారు.

  • Loading...

More Telugu News