: టీ20 క్రికెట్‌లో అంతకన్నా మేటి ఆటగాడు లేడేమో అనిపించింది: గవాస్కర్‌


నిన్నటి టీ20 ప్రపంచ కప్‌ మ్యాచ్‌లో స్టార్‌ బ్యాట్స్‌మెన్‌ విరాట్‌ కోహ్లీ.. 51 బంతుల్లో 9 ఫోర్లు, రెండు సిక్స్‌లతో 82 పరుగులు చేసి అజేయంగా నిలిచి, భారత్‌ను సెమీస్‌కు చేర్చిన విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో కోహ్లీకి ఎంతో మంది ప్ర‌ముఖుల నుంచి ప్ర‌శంస‌ల జ‌ల్లు కురిస్తోంది. "విరాట్‌ అలా చెలరేగిపోతుంటే... టీ20 క్రికెట్‌లో అంతకన్నా మేటి ఆటగాడు లేడేమో అనిపించింద"ని భారత జట్టు మాజీ కెప్టెన్‌ సునీల్‌ గవాస్కర్ అన్నారు. "కోహ్లీ ఆట‌తీరు అసాధారణం, అతడు బ్యాటింగ్‌ చేస్తున్న క్షణాల్లో నా ఒంటిపై రోమాలు నిక్కబొడుచుకున్నాయి" అన్నారు. కోహ్లీ ఆట‌ను చూస్తూ క‌ద‌ల‌కుండా అలాగే నిల‌బ‌డి పోయాన‌ని చెప్పారు. ధోనీ కూడా చ‌క్క‌ని స‌హకారం అందించాడ‌ని వ్యాఖ్యానించారు.

  • Loading...

More Telugu News