: డిక్టేటర్ లా వ్యవహరిస్తున్న ప్రధాని మోదీ : అసోం సీఎం వ్యాఖ్యలు
ప్రధాని నరేంద్ర మోదీ ఒక నియంతగా ఉండాలని కోరుకుంటున్నారని, అన్ని రాష్ట్రాలను పరిపాలించాలని చూస్తున్నారని అసోం ముఖ్యమంత్రి తరుణ్ గొగొయ్ తీవ్రంగా ఆరోపించారు. ఉత్తరాఖండ్ సంక్షోభంపై విలేకరులు ఆయన్ని ప్రశ్నించగా పైవిధంగా స్పందించారు. అన్ని రాష్ట్రాల్లో తమ పరిపాలనే ఉండాలని మోదీ చూస్తున్నారని, తమ రాష్ట్రంలో బీజేపీని ఎట్టి పరిస్థితుల్లోను అధికారంలోకి రానీయమని గొగొయ్ పేర్కొన్నారు. మాజీ కాంగ్రెస్ నేత హిమంతా బిస్వా ద్వారా తమ ప్రభుత్వంపై ఆరోపణలు చేయిస్తున్నారని, గత రెండేళ్లుగా పాలన కొనసాగిస్తున్న మోదీ ప్రభుత్వం విఫలమైందని గొగొయ్ ఆరోపించారు.