: చ‌ర్ల‌ప‌ల్లి జైలులో హెచ్‌సీయూ విద్యార్థులను పలకరించి, మద్దతు ప‌లికిన‌ షిండే


హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్శిటీ (హెచ్‌సీయూ)లో దళితులను అణచివేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత సుశీల్‌కుమార్‌ షిండే అన్నారు. చర్లపల్లి సెంట్రల్ జైలులో హెచ్‌సీయూ విద్యార్థులను షిండే సోమవారం కలిశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. వీసీ అప్పారావు రాజీనామా చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. యూనివర్శిటీలో పరిస్థితులు, వీసీ వ్యవహారంపై విద్యార్థులు ఆయనకు వివరించారు. హెచ్‌సీయూ ఘటనలో విద్యార్థులకు అండగా ఉంటామని షిండే హామీ ఇచ్చారు. షిండే వెంబడి పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పలువురు కాంగ్రెస్ నేతలున్నారు.

  • Loading...

More Telugu News