: జై మాహిష్మతి...బాహుబలితో అసోసియేట్ కావడం గర్వంగా ఉంది: 'బాహుబలి' వీరుల ట్వీట్లు


బాహుబలి చిత్రం జాతీయ అవార్డు సాధించడంపై ఈ సినిమాలో భాగమైన ప్రతి ఒక్కరూ ఆనందంతో ఉబ్బితబ్బిబ్బవుతున్నారు. బాహుబలికి అవార్డు రావడంపై వారంతా ట్విట్టర్లో తమ హర్షం వ్యక్తం చేశారు. ఈ సినిమాలో భల్లాలదేవ పాత్ర పోషించిన రానా...జై మాహిష్మతి అంటూ ట్వీట్ చేశాడు. జాతీయ స్థాయి అవార్డు గెలుచుకున్న బాహుబలి చిత్ర బృందానికి శుభాకాంక్షలు అంటూ జూనియర్ ఎన్టీఆర్ చెప్పాడు. ఈ సినిమాలో అవంతిక పాత్రధారి తమన్నా...'లవ్ లీ... బాహుబలి సినిమా బృందానికి శుభాకాంక్షలు' అని ట్వీటింది. బాహుబలి సినిమాలో భాగమైనందుకు గర్వంగా ఉందని, హిందీలో ఈ సినిమాను పంపణీ చేసిన కరణ్ జోహర్ ట్వీట్ చేశాడు. సినీ పరిశ్రమ మొత్తాన్ని గర్వపడేలా చేసిన రాజమౌళికి అభినందనలు, బాహుబలికి జాతీయ అవార్డు రావడం ఆనందంగా ఉందని టాలీవుడ్ అగ్రనటుడు నాగార్జున అక్కినేని ట్వీట్ చేశాడు.

  • Loading...

More Telugu News