: లాహోర్ దాడికి పాల్పడింది మేమే: జమాతుల్ అహ్రర్
పాకిస్థాన్‌లోని లాహోర్ లో ఆదివారం జరిగిన ఆత్మాహుతి దాడికి పాల్పడింది తామేనంటూ జమాతుల్ అహ్రర్ అనే ఉగ్రవాద సంస్థ ప్రకటించుకుంది. లాహోర్ లోని గుల్షన్-ఇ-ఇక్బాల్ పార్క్ లోని వాహనాల పార్కింగ్ ప్రాంతంలో ఒక ఉగ్రవాది ఈ దాడికి పాల్పడిన విషయం తెలిసిందే. ఆదివారం కావటంతో ఎక్కువ మంది సందర్శకులు పార్క్‌కు పెద్దసంఖ్యలో తరలివచ్చారు. ఈ దాడితో లాహోర్ మొత్తం దద్దరిల్లింది. ఈ ఘటన వాహనాల పార్కింగ్ ప్రాంతంలో జరిగింది. దాడిలో మృతుల సంఖ్య 72కు చేరింది. ఈ నేపథ్యంలో ఈ రోజు లాహోర్‌లో స్కూళ్లకు సెలవు ప్రకటించారు.