: కోహ్లీ.. నీ ఆట అద్భుతం, ధోనీ.. మరోసారి నిరూపించావ్: అమితాబ్ బచ్చన్
నిన్నటి టీ20 ప్రపంచ కప్ మ్యాచ్‌లో స్టార్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ.. అద్భుత ఆటతీరుతో భారత్‌ను సెమీస్‌కు చేర్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కోహ్లీతో పాటు టీమిండియా కెప్టెన్ ఎంతో మంది ప్రముఖుల నుంచి ప్రశంసలు అందుకుంటున్నారు. ఈ సందర్భంగా బాలీవుడ్ స్టార్స్ అమితాబ్ బచ్చన్, అమిర్ ఖాన్.. వారిపై ప్రశంసల జల్లులు కురిపించారు. కోహ్లీ ఆట అద్భుతమని, అది చూస్తూ రాత్రంతా ఎంతో ఆనందంగా గడిపామని బిగ్ బీ అమితాబ్ బచ్చన్ విరాట్ ని ప్రశంసించారు. ఇంకా, ధోనీ గురించి స్పందింస్తూ.. 'నువ్వేంటో నీ సేన ఏంటో మరోసారి నిరూపించావ్.. నిన్ను చూసి ఎంతో నేర్చుకోవాలి’ అని అన్నారు. మరో వైపు అమిర్ ఖాన్ కూడా స్పందిస్తూ.. ‘విరాట్ అద్భుతంగా రాణించాడు.. క్రికెట్ ఒక్కటే కాదు మారథాన్, చెస్, ఆర్చరీ అన్నీ ఒకేసారి చూస్తున్నట్టు అనిపించింది' అని ప్రశంసించాడు. ఇప్పటికే ప్రధాని మోదీ, వ్యాపార వేత్త విజయ్‌మాల్యా, వీరేంద్ర సెహ్వాగ్ వంటి ప్రముఖులతో పాటు ఆస్ట్రేలియా మీడియా, క్రికెట్ అభిమానులు.. టీమిండియాను, విరాట్ కోహ్లీ బ్యాటింగ్ తీరుపై ప్రశంసల జల్లు కురిపిస్తోన్న సంగతి తెలిసిందే.