: నకిలీ ధ్రువపత్రాలతో సిమ్ కార్డులు జారీ చేసే షాపులపై పోలీసుల దాడులు


హైద‌రాబాద్‌లో సంచలం రేపిన అభయ్ హత్య కేసులో నిందితులు.. ఓ షాపులో న‌కిలీ ధ్రువపత్రాలతో సిమ్ కార్డులు కొని రైలులో వెళ్తూనే అభయ్ తండ్రికి ఫోన్ చేసి డబ్బు డిమాండ్ చేసిన విష‌యం తెలిసిందే. అలాగే, ఇటీవ‌ల న‌కిలీ ధ్రువప‌త్రాలతో సిమ్‌కార్డులు కొని, ఆపై మోసాల‌కు పాల్ప‌డుతున్న సంఘ‌ట‌న‌లు వెలుగులోకి వ‌స్తూనే ఉన్నాయి. ఈ నేప‌థ్యంలో నకిలీ ధ్రువపత్రాలతో సిమ్ కార్డులు జారీ చేసే షాపులపై పోలీసులు దాడి జ‌రుపుతున్నారు. ఇందులో భాగంగా ఈ రోజు అబిడ్స్, జగదీష్ మార్కెట్, బోయిన్‌పల్లి సహా వివిధ ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టారు. న‌కిలీ ధ్రువప‌త్రాల‌తో సిమ్‌కార్డులు జారీ చేస్తే ఉపేక్షించ‌బోమ‌ని పోలీసులు హెచ్చ‌రిస్తున్నారు.

  • Loading...

More Telugu News