: తెలంగాణ ఎమ్మెల్యేల వేతనం రూ. 95 వేల నుంచి రూ. 2.58 లక్షలకు జంప్!


తెలంగాణలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల వేతనాన్ని పెంచుతూ తీసుకువచ్చిన బిల్లును మంత్రి హరీశ్ రావు కొద్దిసేపటి క్రితం అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ఎమ్మెల్యేల వేతనాన్ని ప్రస్తుతమున్న రూ. 95 వేల నుంచి రూ. 2.58 లక్షలకు పెంచుతున్నట్టు ప్రతిపాదించారు. హెచ్ఆర్ఏను రూ. 25 వేల నుంచి రూ. 50 వేలకు పెంచుతున్నట్టు తెలిపారు. బేసిక్ ను రూ. 20 వేలు పెంచుతున్నట్టు ప్రకటించారు. స్పెషల్ కార్ సెక్యూరిటీ అలవెన్స్ గా రూ. 25 వేలు జోడిస్తున్నామని, నియోజకవర్గ స్పెషల్ అలవెన్స్ ను రూ. 83 వేలకు పెంచుతున్నామని ఆయన తెలిపారు. వేతనాల పెంపు కారణంగా ప్రభుత్వ ఖజానాపై రూ. 42.67 కోట్ల అదనపు భారం పడనుందని హరీశ్ వివరించారు. ఈ బిల్లుకు మూజువాణీ ఓటుతో అసెంబ్లీ ఆమోదం పలికింది.

  • Loading...

More Telugu News