: బెంగ‌ళూరులో వైభవంగా చిరంజీవి చిన్న కుమార్తె శ్రీ‌జ వివాహం


మెగాస్టార్ చిరంజీవి చిన్న కుమార్తె శ్రీజ వివాహం వైభవంగా జరిగింది. ఈ రోజు ఉదయం 9:13 నిమిషాలకు బెంగుళూరు లోని చిరు ఫామ్ హౌస్ వేదికగా శ్రీజ వివాహం జరిగింది. శ్రీజ చిన్ననాటి స్నేహితుడు కల్యాణ్తో ముందుగా నిర్ణ‌యించిన ముహూర్తం ప్ర‌కారం వివాహం జరిగింది. కుటుంబ సభ్యులు, సన్నిహితులు మాత్రమే పెళ్లికి హాజ‌ర‌యినట్లు స‌మాచారం. ఈ వేడుక‌కు ద‌ర్శ‌కేంద్రుడు రాఘవేంద్రరావు, రానా హాజరైనట్లు తెలుస్తోంది. పెళ్లి వేడుక సంద‌ర్భంగా చిరంజీవి పాటలకు రామ్ చరణ్, అల్లు అర్జున్, వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్, నాగబాబు ఆనందంతో చిందులేశారట. ఇక‌ రిసెప్షన్ హైదరాబాద్లోని పార్క్ హయత్ హోటల్లో ఏర్పాటు చేశారు. మార్చి 31న ఇక్క‌డ గ్రాండ్గా వెడ్డింగ్ రిసెప్షన్ జరుగనుంది. వివాహ విందుకు ప‌లు రంగాల‌కు చెందిన‌ ముఖ్యమైన వారిని ఆహ్వానించి, గ్రాండ్‌గా నిర్వ‌హించ‌నున్న‌ట్లు తెలుస్తోంది.

  • Loading...

More Telugu News