: సెమీఫైనల్ మ్యాచ్‌లో విరాట్ కోహ్లి, క్రిస్ గేల్‌ మ‌ధ్య‌ సమరం: విజ‌య్ మాల్యా


నిన్నటి టీ20 ప్రపంచ కప్‌ మ్యాచ్‌లో స్టార్‌ బ్యాట్స్‌మెన్‌ విరాట్‌ కోహ్లీ.. 51 బంతుల్లో 9 ఫోర్లు, రెండు సిక్స్‌లతో 82 పరుగులు చేసి అజేయంగా నిలిచి, భారత్‌ను సెమీస్‌కు చేర్చిన విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో కోహ్లీ ఎంతో మంది ప్ర‌ముఖుల నుంచి ప్ర‌శంస‌లు అందుకుంటున్నారు. కోహ్లికి ప్రముఖ వ్యాపారవేత్త విజయ్ మాల్యా కూడా అభినందనలు తెలిపారు. భారత్, వెస్టిండీస్ జట్ల మధ్య జరగనున్న సెమీఫైనల్ మ్యాచ్ ను విరాట్ కోహ్లి, క్రిస్ గేల్ సమరంగా ఆయన వర్ణించారు. ముంబైలో జరగనున్న సెమీఫైనల్ లో ఇద్దరు స్టార్ బ్యాట్స్‌మెన్స్ గేల్, కోహ్లి మ‌ధ్య హోరాహోరీ యుద్ధ‌మే జ‌ర‌గ‌నుందని మాల్యా అన్నాడు. రెండు టీమ్ లకు నా శుభాకాంక్షలు అంటూ ట్విట్ట‌ర్ ద్వారా స్పందించాడు. ఐపీఎల్ లో ఆర్సీబీ తరపున ఆడుతున్న విరాట్ కోహ్లి, క్రిస్ గేల్, ఏబీ డివిలియర్స్, షేన్ వాట్సన్ లతో పాటు, భారత విధ్వంసక బ్యాట్స్ మన్ రానున్న సీజన్ లో సత్తా చాటాలని అన్నాడు.

  • Loading...

More Telugu News