: ఇక షిండే వంతు!... హెచ్ సీయూ విద్యార్థులతో భేటీ కానున్న కాంగ్రెస్ సీనియర్
నెలల తరబడి ఉద్రిక్త వాతావరణంతో అట్టుడుకుతున్న హైదరాబాదు సెంట్రల్ యూనివర్సిటీ విషయంలో ఇప్పటికే పలు ప్రధాన పార్టీలకు చెందిన నేతలు జోక్యం చేసుకున్నారు. ఏకంగా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ వర్సిటీకి వచ్చారు. తాజాగా ఆ పార్టీ సీనియర్ నేత, కేంద్ర హోం శాఖ మాజీ మంత్రి, ఉమ్మడి రాష్ట్రానికి గవర్నర్ గా వ్యవహరించిన సుశీల్ కుమార్ షిండే రంగంలోకి దిగనున్నారు. దళిత సామాజిక వర్గానికి చెందిన ఈ మరాఠా నేత నేడు హైదరాబాదుకు వస్తున్నారు. ముందుగా వర్సిటీకి వెళ్లి అక్కడి పరిస్థితులను ఆరా తీయనున్న ఆయన, ఆ తర్వాత నగరంలోని ఓ హోటల్ లో హెచ్ సీయూ విద్యార్థులు, దళిత సంఘాల నేతలతో భేటీ కానున్నారు.